ధోని పై ద్రావిడ్ సెన్సషనల్ కామెంట్స్..!

భారత మాజీకెప్టెన్‌ రాహుల్‌ ద్రవిడ్‌ స్వతహాగా మృదు స్వభావి అన్న విషయం తెలిసిందే . అలాంటిది ఇతనికి ధోని పై ఓ సందర్భంలో బాగా కోపం వచ్చిందట. ఈ సంగతిని టీమిండియా మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ చెప్పుకొచ్చాడు. ఇటీవల ద్రవిడ్‌ ఓ యాడ్‌లో నటించిన విషయం తెలిసిందే. అందులో ఈ మిస్టర్‌ డిపెండబుల్‌‌ కోపంతో ఊగిపోతూ కనిపిస్తాడు.

ప్రస్తుతం ఆ యాడ్‌ వీడియో‌ సోషల్‌ మీడియాలో హల్చల్ చేస్తుండగా, ఈ సందర్భంగా సెహ్వాగ్‌ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ గతంలో ద్రవిడ్‌ ధోని పై ఆగ్రహించిన విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. 2006లో పాకిస్థాన్‌తో వన్డే సిరిస్‌ సమయంలో ధోనీపై ద్రవిడ్‌ అరిచాడని సెహ్వాగ్ పేర్కొన్నాడు. ధోనీ ఓ మ్యాచ్‌లో పాయింట్‌ దిశలో షాట్‌ కొట్టి ఔటయ్యాడు. అప్పుడు ధోనీపై ద్రవిడ్‌ అలాగేనా ఆడేది అంటూ అరిచాడని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.