కరోనా భారిన పడిన కేంద్ర మంత్రి..!?

దేశంలో క‌రోనా సెకండ్ వేవ్ రోజు రోజుకువిజృంభిస్తుంది. కేసులు బాగా ఎక్కువ అవుతున్న తరుణంలో అటు సామాన్య ప్ర‌జ‌ల‌తో పాటు ప‌లువురు సినీ, రాజ‌కీయ రంగ ప్ర‌ముఖులు కూడా ఈ కరోనా మ‌హ‌మ్మారి బారిన‌ ప‌డుతున్నారు. తాజాగా కేంద్ర వ్యవసాయ, ఆహార శుద్ధి శాఖ సహాయ మంత్రి సంజీవ్ ​బల్యాన్‌కు కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయింది. ఈ సంగతిని ఆయన తన ట్విట్టర్ ద్వారా తెలిపారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా బెంగాల్‌లో పర్యటించినప్పడు ఆయనకి కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకోగా, దాంతో తనకి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింద‌ని ఆయ‌న ట్విట్ట‌ర్‌లో వెల్లడించారు. ప్రస్తుతం ఆయన హోంక్వారంటైన్‌లో ఉన్నారు. ఇటీవల కాలంలో తనని కలిసిన పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు, అధికారులు, ఇంకా ప్ర‌జ‌లు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాల‌ని, కొద్ది రోజుల‌పాటు హోంక్వారెంటైన్‌లో ఉండాల‌ని మంత్రి సంజీవ్ ​బల్యాన్ కోరారు.