హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న వీర‌ప్ప‌న్ కుమార్తె!

వీరప్పన్..పోలీసులకు, ప్ర‌భుత్వాల‌కు నిద్ర లేకుండా చేసిన‌ పేరు ఇది. కొన్నేళ్ల పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల‌ను గ‌డ‌గ‌డ‌లాడించిన వీర‌ప్ప‌న్‌.. గంధపుచెట్ల స్మగ్లింగ్, ఏనుగుల దంతాల అక్రమ రవాణా ఇలా చాలా అరాచకాలే చేశాడు. ఇక ఈయ‌న‌ను 2004లో తమిళనాడు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ అధికారులు కాల్చి చంపిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే.. విర‌ప్ప‌న్‌కు ఇద్ద‌రు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కూతురు విద్యారాణి ఇటీవలే బీజేపీ పార్టీలో చేరారు. అయితే రెండోకూతురు విజయలక్ష్మి త్వ‌ర‌లోనే `మావీరన్‌ పిళ్లై` చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వ‌బోతోంది.

రాజ్శ్రీ దర్శకత్వం వ‌హిస్తున్న కేఎన్‌ఆర్‌ మూవీస్‌ పతాకంపై కేఎన్‌ఆర్ నిర్మిస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ శుక్రవారం విడుదలైంది. ఈ పోస్టర్లో విజయలక్ష్మి తండ్రి వీరప్పన్‌ గెటప్‌లో భుజాన తుపాకీ పట్టుకొని నిలబడ్డారు. దీంతో ఈ చిత్రం కూడా గంధపు చెక్కల స్మగ్లింగ్‌ నేపథ్యంలో సాగే కథ అని తెలుస్తోంది.

வீரப்பன் மகள் நடிக்கும் 'மாவீரன் பிள்ளை'; ஃபர்ஸ்ட் லுக் போஸ்டர் வெளியீடு! | veerappan  daughter vijayalakshmi's 'Maaveeran Pillai' First Look | Puthiyathalaimurai  - Tamil News | Latest Tamil ...

Share post:

Latest