`వ‌కీల్ సాబ్‌` క‌లెక్ష‌న్స్‌..దుమ్ముదులిపేసిన ప‌వ‌న్‌!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ లాంగ్ గ్యాప్ త‌ర్వాత న‌టించిన చిత్రం `వ‌కీల్ సాబ్‌`. వేణు శ్రీ‌రామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో శ్రుతి హాస‌న్ హీరోయిన్‌గా న‌టించ‌గా..నివేత థామస్, అంజలి, అన‌న్య నాగ‌ల్ల కీల‌క పాత్ర‌లు పోషించారు.

దిల్ రాజు, బోణి కపూర్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం బాలీవుడ్‌లో హిట్ అయిన `పింక్‌`కు రీమేక్. ఇక భారీ అంచ‌నాల న‌డుము ఈ చిత్రం నిన్న ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే. అయితే విడుద‌లైన అన్ని చోట్ల‌ పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం క‌లెక్ష‌న్స్ ప‌రంగా కూడా దుమ్ము దులిపేసింది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం ఏకంగా రూ.32.28 కోట్లు షేర్ రాబ‌ట్టింది. దీంతో లాక్‌డౌన్ త‌ర్వాత అత్య‌ధిక‌గా వ‌సూళ్లు రాబ‌ట్టిన చిత్రంగా వ‌కీల్ సాబ్ నిలిచింది. ఏపీ – తెలంగాణలో ఏరియాల వారీగా ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ ఇలా ఉన్నాయి..

నైజాం- 8.75 కోట్లు
సీడెడ్- 4.52 కోట్లు
ఉత్తరాంధ్ర- 3.85 కోట్లు
ఈస్ట్ గోదావరి- 3.10 కోట్లు
వెస్ట్ గోదావరి- 4.50 కోట్లు
గుంటూరు- 3.95 కోట్లు
కృష్ణ- 1.9 కోట్లు
నెల్లూరు- 1.71 కోట్లు‌
————————————
మొత్తం క‌లెక్ష‌న్‌- 32.28 కోట్లు
————————————

Share post:

Latest