ఏపీ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం..18 ఏళ్లు నిండిన వారికి టీకా ఎప్పుడంటే?

ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ వీర విహారం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే దేశంలో రోజురోజుకు రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాలు న‌మోదు అవుతున్నాయి. మ‌రోవైపు క‌రోనాను అరిక‌ట్టేందుకు దేశ‌వ్యాప్తంగా టీకా పంపిణీ జోరుగా కొనసాగుతోంది. పద్దెనిమిదేళ్లు నిండిన వారందరికీ కూడా మే 1 నుంచి వ్యాక్సిన్ వేయ‌బోతున్న‌ట్టు కేంద్ర ప్ర‌భుత్వం ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది.

వ్యాక్సిన్ల కొనుగోలు అధికారాన్ని ఇప్పటికే రాష్ట్రాలకు ఇచ్చేసింది. ఈ నెల 28 నుంచి రిజిస్ట్రేషన్లనూ మొదలుపెట్టబోతోంది. ఇలాంటి త‌రుణంలో ఏపీ స‌ర్కారు కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. 18 ఏళ్లు నిండిన వారికి మే 1 నుంచి కాకుండా.. జూన్ నుంచి వ్యాక్సిన్ వేయ‌నున్న‌ట్టు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు.

టీకా పంపిణీ కోసం సంబంధిత కంపెనీలతో సంప్రదింపులు జరుపుతున్నామని, కానీ ఇప్పటి వరకు ఎలాంటి ఒప్పందాలు జరగలేదన్నారు. కాబట్టి వీరికి టీకాలు ఇచ్చేందుకు మరికొంత సమయం పడుతుందన్నారు.

Share post:

Latest