`ఉప్పెన‌`కు బిగ్ షాక్‌..బుల్లితెర‌పై బోల్తా ప‌డిన వైష్ణ‌వ్‌?!

మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్, కృతి శెట్టి జంట‌గా న‌టించిన చిత్రం `ఉప్పెన‌`. బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని సుకుమార్ రైటింగ్స్, మైత్రి మువీ మేకర్స్ లు సంయుక్తంగా నిర్మించారు. భారీ అంచ‌నాల న‌డుమ ఫిబ్ర‌వ‌రి 12న విడుద‌ల అయిన ఈ చిత్రం సూప‌ర్ డూప‌ర్ హిట్‌గా న‌టించింది.

100 కోట్లు రాబ‌ట్టిన ఈ చిత్రం ఎన్నో రికార్డులను కూడా బ‌ద్ద‌లు కొట్టింది. అయితే బాక్సాఫీస్ వ‌ద్ద బంప‌ర్ హిట్‌గా నిలిచిన ఈ చిత్రం బుల్లితెర‌పై మాత్రం బోల్తా ప‌డింద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ప్రముఖ తెలుగు ఎంటర్టైమెంట్ ఛానల్ స్టార్ మా వారు ఏప్రిల్ 18న ఉప్పెన చిత్రాన్ని ప్ర‌సారం చేశార‌ట‌.

అయితే స్మాల్ స్క్రీన్ పై ఈ చిత్రం పెద్ద‌గా స‌త్తా చాట‌లేక‌పోయింద‌ని అంటున్నారు. నిజానికి ఉప్పెన లాంటి చిత్రం మొద‌టి సారి టీవీలో వ‌స్తే 20 పైగా టి.ఆర్.పి రేటింగ్ రాబ‌ట్టాల్సి ఉంటుంది. కానీ, ఉప్పెన విషయంలో అలా జరగలేదని.. ఊహించిన దానికంటే చాలా త‌క్కువ టి.ఆర్.పి రేటింగ్ వ‌చ్చింద‌ని టాక్ న‌డుస్తోంది.

Share post:

Popular