బుర్జ్ ఖలీఫాపై భారతీయ జెండా…!

April 27, 2021 at 12:41 pm

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యూఏఈ లోని ప్రఖ్యాత భవనం పై భారత జెండా మెరిసింది. ఇండియాలో కరోనా కేసులు బాగా పెరిగిన నేపథ్యంలో దేశానికి సంఘీభావంగా యూఏఈలోని పలు ప్రసిద్ధ భవనాల పై ఆదివారం భారత జాతీయ జెండాను ప్రదర్శించారు. దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా, అబుదాబిలోని అడ్నోక్ ప్రధాన కార్యాలయాలు భారత జెండాలు మెరిసాయి.

స్టే స్ట్రాంగ్ ఇండియా అంటూ అక్కడ ప్రదర్శించిన భారత త్రివర్ణ పతాకం వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్నాయి. ఇండియా ఇన్ యూఏఈ తన ట్విట్టర్ లో ఈ వీడియోను పోస్ట్ చేసింది. కారానికి వ్యతిరేకంగా పోరాడుతున్న ఇండియాకు దుబాయ్‌లోని అత్యంత్య ఎత్తైన భవనం బుర్జ్‌ ఖలీఫా పై మన జాతీయ జండాను ప్రదర్శించి యూఏఈ తన సపోర్ట్ ను తెలియజేసింది. యావత్ భారతదేశంలో కరోనా సంక్షోభంతెసీరాం అవ్వటంతో యుకె, యుఎస్, కెనడా తమ సహాయాన్ని ప్రకటించాయి.

బుర్జ్ ఖలీఫాపై భారతీయ జెండా…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts