మరోకసారి పోలీస్ అధికారిగా కనిపించనున్న గౌతమ్ మీనన్!

April 27, 2021 at 12:33 pm

ప్రముఖ తమిళ దర్శకుడు గౌత‌మ్‌ వాసుదేవ్ మీన‌న్‌ టాలీవుడ్ లోను ఘర్షణ, సూర్య సన్నాఫ్ కృష్ణన్, ఏం మాయ చేసావే వంటి సూప‌ర్‌హిట్ చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుపరిచితమే. మంచి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకి కూడా ఆయన బాగా దగ్గరైయ్యారు. అయితే ఈ డైరెక్టర్, దర్శకత్వం మాత్రమే కాకుండా అప్పుడప్పుడు సినిమాల్లో గెస్ట్ అప్పీరెన్స్ ఇస్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలో ఐతే ఫుల్ టైమ్ నటుడిగా కూడా ఆయన నటిస్తున్నాడు.

గ‌త ఏడాది రిలీజ్ అయిన కనులు కనులను దోచాయంటే చిత్రంలో పోలీస్ పాత్రలో కనిపించి ప్రేక్షకుల్ని మెప్పించిన గౌతమ్ ఇప్పుడు మరోకసారి అలాంటి పాత్రలో నటిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్‌ తెరకెక్కిస్తోన్న చిత్రం విడుదలై. ఈ చిత్రంలో సూరి, విజయ్‌ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో పోలీస్‌ అధికారిగా ఓ కీలక పాత్రలో గౌతమ్ మీనన్ కనిపించనున్నారు.

మరోకసారి పోలీస్ అధికారిగా కనిపించనున్న గౌతమ్ మీనన్!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts