మ‌హ‌బూబాబాద్ ఎంపీ‌కు క‌రోనా పాజిటివ్..!?

తెలంగాణ కరోనా మహమ్మారి చాలా వేగంగా విజృంభిస్తోంది. గత కొద్ది రోజులుగా రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా మ‌హ‌బూబాబాద్ టీఆర్ఎస్ ఎంపీ మాలోతు క‌విత‌కు క‌రోనా పాజిటివ్ అని నిర్ధార‌ణ అయింది. డాక్టర్స్ సలహా మేర‌కు ఆమె హైద‌రాబాద్‌లో హోం ఐసోలేష‌న్‌లో ఉన్న‌ట్లు క‌విత తెలిపారు. ఇటీవ‌ల త‌న‌ను క‌లిసిన వారంతా వెంటనే కొవిడ్ టెస్టులు చేయించుకోవాల‌ని ఎంపీ కవిత సూచించారు.

కొత్తగా నమోదైన కేసులో అత్యధికంగా 505 జీహెచ్‌ఎంసీలో, మేడ్చల్‌లో 407, రంగారెడ్డిలో 302, నిజామాబాద్‌లో 303, సంగారెడ్డిలో 175 అత్యధికంగా కొవి‌డ్‌ కేసులు నమోదు అయ్యాయి. నిన్న ఒకే రోజులోనే రాష్ట్రంలో 1,21,880 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,41,885కు చేరగా, ఇప్పటి వరకు 3,09,594 మంది కరోనా నుండి కోలుకున్నారు.

Share post:

Latest