ఆసక్తిని పుట్టిస్తున్న ది బర్త్ 10000 బీసీ ట్రైలర్..!

డాక్టర్ విక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ ది బర్త్ 10000 బీసీ. రానా ప్రతాప్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ మూవీ శ్రీ వినాయక మారుతి క్రియేషన్స్, లక్ష ప్రొడక్షన్స్ బ్యానర్ల పై ప్రదీప్ జైన్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. జుడా సంధి దీనికి సంగీతం అందిస్తున్నారు. కన్నడ భాషలో తెరకెక్కుతున్న ఆ యాక్షన్ థ్రిల్లర్ ను తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో కూడా రిలీజ్ చేయనున్నారు.

- Advertisement -

ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజ్ అయిన మూవీ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ది బర్త్ 10000 బీసీ ట్రైలర్ ను మెగా సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు. చిత్ర ట్రైలర్ లోని సన్నివేశాలు, సాహసాలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఇంకెందుకు లేట్ ఈ మూవీ ట్రైలర్ ను మీరు కూడా వీక్షించండి.

 

 

 

<iframe width=”560″ height=”315″ src=”https://www.youtube.com/embed/QWz9tWnuvuk” title=”YouTube video player” frameborder=”0″ allow=”accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture” allowfullscreen></iframe>

Share post:

Popular