ఐపీఎల్ 2021: నేడు బెంగళూరుతో హైద‌రాబాద్ అమీతుమీ..గెలుపెవ‌రిదో?

ఐసీఎల్ 2021 సీజ‌న్‌లో భాగంగా నేడు చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదిక‌గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో సన్‌రైజర్స్ హైదరాబాద్ అమీతుమీ తేల్చుకోనుంది. తొలి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ చేతిలో సన్‌రైజర్స్ ఓడిపోయిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ సీజన్‌ను ఓటమితో ప్రారంభించిన సన్‌రైజర్స్.. రెండో మ్యాచ్‌తోనైనా బోణీ కొట్టాల‌ని క‌సితో ఉంది.

మ‌రోవైపు ఫస్ట్ మ్యాచ్‌లోనే ముంబయి ఇండియన్స్‌పై గెలిచిన కోహ్లీ సేన‌.. రెండో మ్యాచ్‌ను కూడా త‌న ఖాతాలో వేసుకోవాల‌ని చూస్తోంది. ఇరు జట్లలోనూ వరల్డ్ క్లాస్ ప్లేయర్స్ ఉన్నారు. మ‌రి ఈ రోజు జ‌ర‌గ‌బోయే మ్యాచ్‌లో గెలుపెవ‌రిదో తెలియాలంటే.. మ‌రికొన్ని గంట‌లు వేచి చూడాల్సిందే.

కాగా, ఈ రెండు జ‌ట్ల మ‌ధ్య ఇప్ప‌టి వ‌ర‌కు 18 మ్యాచ్‌లు జ‌ర‌గ‌గా.. హైదరాబాద్ టీమ్ 10 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఇక మిగిలిన ఎనిమిది మ్యాచ్‌లకిగానూ ఏడింట్లో బెంగళూరు జట్టు విజ‌యం సాధించింది. ఒక మ్యాచ్‌లో మాత్రం ఫలితం తేలలేదు. ఈ రెండు జట్లు తలపడిన ప్రతిసారి పోరు చాలా ఆసక్తికంగా జరుగుతున్నట్లు రికార్డులు చెప్తున్నాయి. మ‌రి ఇవాల్టీ మ్యాచ్ ఎలా ఉండ‌బోతుందో చూడాలి.

Share post:

Latest