`వ‌కీల్ సాబ్‌` యూనిట్‌పై శ్రుతిహాస‌న్ ఫ్యాన్స్ గుర్రు..ఎందుకంటే?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తాజా చిత్రం `వ‌కీల్ సాబ్`. వేణు శ్రీ‌రామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంలో ప‌వ‌న్‌కు జోడీగా శ్రుతి హాస‌న్ న‌టించ‌గా.. నివేదా థామస్, లావణ్య త్రిపాటి, అనన్య నాగల్ల, అంజలి ప్రధాన పాత్ర పోషించారు. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 9న విడుద‌ల కానుంది.

దీంతో చిత్ర యూనిట్ ప్ర‌మోష‌న్స్ ప్రారంభించింది. ఇందులో భాగంగానే వ‌కీల్ సాబ్ ట్రైల‌ర్‌ను ఇటీవ‌ల విడుద‌ల చేయ‌గా.. అదిరిపోయే రెస్పాన్స్ వ‌చ్చింది. అయితే ట్రైల‌ర్ విష‌యంలో శ్రుతి హాస‌న్ ఫ్యాన్స్ వ‌కీల్ సాబ్ యూనిట్‌పై గుర్రుగా ఉన్నారు.

శుత్రి హాస‌న్‌కు సంబంధించి ఒక్క షాట్ కూడా ట్రైల‌ర్‌లో చూపించకపోవడం ఇందుకు కార‌ణం. ట్రైలర్ లో నివేదా థామస్, అంజలి, అనన్యను అంత సేపు చూపించారు కానీ కావాలనే తమ హీరోయిన్ ను దాచేశారు అంటూ శ్రుతి అభిమానులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. అయితే ట్రైలర్ లో చూపించకపోయినా సినిమాలో శ్రుతి పాత్ర చాలా బాగుంటుందని.. కచ్చితంగా మంచి పేరు వస్తుంది అంటూ చిత్ర యూనిట్ చెబుతోంది.‌

Share post:

Latest