ప్ర‌భాస్ అలా బిహేవ్ చేస్తాడ‌ని అనుకోలేదు..శ్రుతిహాస‌న్ షాకింగ్ కామెంట్స్‌!

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌, శ్రుతి హాస‌న్ జంట‌గా న‌టిస్తున్న తాజా చిత్రం `స‌లార్‌`. కేజీఎఫ్ ఫేమ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రాన్ని హోంబ‌లే ఫిలింస్ బ్యానర్‌పై విజ‌య్ కిర‌గందూర్ భారీ ఎత్తున నిర్మించబోతున్నారు.

2022 ఏప్రిల్ 14న విడుద‌ల కానున్న ఈ చిత్రం షూటింగ్ ద‌శ‌లో ఉంది. అయితే ఇటీవ‌ల జరిగిన షెడ్యూల్లో ప్ర‌భాస్‌, శ్రుతి హాస‌న్‌ కాంబినేషన్లో కొన్ని సీన్స్ ను చిత్రీకరించారు. ఇదిలా ఉంటే.. తాజాగా ప్ర‌భాస్ వ్య‌క్తిత్వం గురించి శ్రుతి షాకింగ్ కామెంట్స్ చేసింది.

హసన్ మాట్లాడుతూ.. `తాను ఒక పెద్ద స్టార్ ను అనే విషయాన్ని ప్ర‌భాస్ పూర్తిగా పక్కన పెట్టేస్తారు. చాలా సింపుల్‌గా ఉంటారు. పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ ఉన్న ఆయ‌న అంద‌రితోనూ ప్రేమ‌గా, ఫ్రెండ్లీగా బిహేవ్ చేస్తార‌ని నేను అస్స‌లు ఊహించ‌లేదు. ప్రభాస్ సెట్లో ఉన్నంత సేపు అక్కడి వాతావరణం సందడిగా ఉంటుంది. ఇక ఆయనతో కలిసి నటించడం ఎవరికైనా కంఫర్ట్ గానే ఉంటుంది` అని ప్ర‌శంస‌లు కురిపించింది. ఇక శ్రుతి కామెంట్స్ ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారాయి.

Share post:

Latest