మెగా హీరోను లైన్‌లో పెట్టిన శేఖర్ కమ్ముల..హీరోయిన్ కూడా ఫిక్స్‌?

శేఖ‌ర్ క‌మ్ముల‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `డాలర్ డ్రీమ్స్` సినిమాతో ద‌ర్శ‌కుడిగా ఎంట్రీ ఇచ్చిన శేఖ‌ర్ క‌మ్ముల‌.. ఆ త‌ర్వాత `ఆనంద్` చిత్రాన్ని తెర‌కెక్కించి మంచి కమర్షియల్ హిట్ అందుకున్నాడు. బాపు, విశ్వనాథ్‌ల తర్వాత తనదైన సెన్సిబుల్ మూవీలతో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తూ ఇండ‌స్ట్రీలో సెన్సిబుల్ డైరెక్ట‌ర్‌గా త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు.

- Advertisement -

ఇక `ఫిదా` వంటి సూప‌ర్ హిట్ త‌ర్వాత శేఖ‌ర్ క‌మ్ముల.. నాగ చైత‌న్య, సాయి ప‌ల్ల‌విల‌తో `ల‌వ్ స్టోరీ` చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఈ చిత్రం ఏప్రిల్ 16న విడుద‌ల కానుంది. విడుద‌ల ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో.. చిత్ర యూనిట్ జోరుగా ప్ర‌మోష‌న్స్ నిర్వ‌హిస్తోంది. అయితే ఇలాంటి స‌మ‌యంలో శేఖ‌ర్ క‌మ్ములు త‌దుప‌రి సినిమాపై ఓ ఇంట్ర‌స్టింగ్ విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది.

శేఖ‌ర్ క‌మ్ముల త‌న త‌దుప‌రి చిత్రం మెగా హీరో వరుణ్ తేజ్‏తో చేయ‌నున్నాడ‌ట‌. ఇప్ప‌టికే ఆయ‌న‌కు చెప్పి.. లైన్‌లో కూడా పెట్టిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. అంతేకాదు, ఈ చిత్రంలో నానీ హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్‌ను ఎంపిక చేశార‌ని అంటున్నార‌. ఇక త్వ‌ర‌లోనే ఈ సినిమాపై ప్ర‌క‌ట‌న రానుంద‌ట‌.

Share post:

Popular