సంపూ పుడింగి నెంబర్‌ వన్‌ షురూ..!

టాలీవుడ్ ఇండస్ట్రీకి హృదయ కాలేయం సినిమాతో ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తేవహుకున్నాడు సంపూ. ఇప్పుడు తాజాగా సంపూర్ణేష్‌బాబు, విద్యుల్లేఖరామన్‌, సాఫీకౌర్‌ నాయకానాయికలుగా నటిస్తున్న సినిమా పుడింగి నెంబర్‌ వన్. ఈ చిత్రానికి మీరావలి దర్శకుడు. కె. శ్రీనివాసరావు, కె. సుధీర్‌కుమార్‌ నిర్మాతలు. మంగళవారం నాడు హైదరాబాద్‌లో ఈ సినిమా మొదలయింది.

ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత కె.ఎస్‌.రామారావు క్లాప్‌నివ్వగా దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు కెమెరా స్విచ్ ఆన్ చేసారు. సంపూర్ణేష్‌బాబు మాట్లాడుతూ నా మార్కు కామెడీతో సాగే సినిమా ఇది. ప్రేక్షకుల్ని చాలా నవ్విస్తుంది అని అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ యాక్షన్‌, సందేశం, వినోదం ఉన్న సినిమా ఇది అని చెప్పారు. మంగళవారం నుండి రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలు కానుంది. ఏప్రిల్‌, మే నెలల్లో షూటింగ్‌ జరిపి జూలైలో విడుదలచే చిత్రాన్ని రిలీజ్ చేస్తాం అని మేకర్స్ తెలిపారు.