ఆసుపత్రిలో కరీనా కపూర్‌ తండ్రి..ఎందుకంటే..!?

కపూర్‌ కుటుంబంలో మరోకసారి కరోనా కలకలం సృష్టించింది. ఇటీవలె రణ్‌బీర్‌ కపూర్‌, నీతూ కపూర్‌లు కరోనా బారిన పడి కోలుకున్నారు. తాజాగా కరీనా కపూర్‌ తండ్రి, నటుడు రణధీర్ కపూర్‌కు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది. 74ఏళ్ల రణధీర్ కపూర్‌కు కరోనా పాజిటివ్‌ అని రావటంతో వెంటనే ఆయన్ని ముంబైలోని కోకిలాబెన్ ఆసుప‌త్రిలో అడ్మిట్ చేశారు. రణధీర్ కపూర్‌కు శ్వాస సంబంధిత సమస్యలు కూడా ఉండటంతో ప్రస్తుతం రణదీర్‌ను ఐసీయూలోకి మార్చినట్లు హాస్పిటల్స్ వర్గాలు వెల్లడించాయి.

ఇటీవలే రణధీర్ కపూర్‌ కరోనా టీకా రెండవ డోస్‌ను కూడా తీసుకున్న విషయం అందరికి తెలిసిందే. రణధీర్ కపూర్‌ త్వరలోగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ పలువురు సినీ ప్రముఖులు ఇంకా నెటిజన్లు అంతా సోషల్‌ మీడియాలో ట్వీట్లు చేస్తున్నారు. అయితే గత ఏడాది సరిగ్గా ఇదే టైములో ఏప్రిల్‌ 30న రణధీర్‌ కపూర్‌ సోదరుడు, ప్రముఖ నటుడు రిషి కపూర్ మరణించిన సంగతి తెలిసిందే.

Share post:

Latest