నాగ‌చైత‌న్య‌, నానిల‌నే ఫాలో అయిన రానా..!

క‌రోనా వేగంగా విజృంభిస్తున్న సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా టాలీవుడ్‌లో క‌రోనా తీవ్ర క‌ల‌క‌లం రేపుతోంది. ఇలాంటి త‌రుణంలో రిస్క్ చేయ‌లేక ప‌లువురు హీరోలు త‌మ సినిమా విడుద‌ల‌ను వాయిదా వ‌స్తున్నారు. ఇప్ప‌టికే నాగ‌చైత‌న్య, నాని త‌మ సినిమాల విడుద‌ల‌ను పోస్ట్ పోన్ చేశారు. ఇప్పుడు వీరిద్ద‌రినీ ద‌గ్గుబాటి వారి అబ్బాయి రానా కూడా ఫాలో అయ్యాడు.

ద‌గ్గుబాటి రానా, సాయి ప‌ల్ల‌వి జంట‌గా న‌టిస్తున్న తాజా చిత్రం `విరాట‌ప‌ర్వం`. వేణు ఉడుగుల దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి నిర్మించారు.

ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 30న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్న‌ట్టు ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. అయితే తాజాగా విడుద‌ల వాయిదా వేస్తున్న‌ట్టు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని తెలిపారు.

Image

Share post:

Popular