గోపీచంద్ కోసం ఆ ప‌ని చేస్తున్న రానా..ఇక ఫ్యాన్స్‌కు పండ‌గే?

టాలీవుడ్ మాచో హీరో గోపీచంద్ తాజా చిత్రం `సీటీమార్` ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకుంది. సంపత్ నంది ద‌ర్వ‌క‌త్వంలో త‌మ‌న్నా హీరోయిన్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధం అవుతోంది. ఇక ఈ చిత్రం త‌ర్వాత గోపీచంద్ తేజ దర్శకత్వంలో ‘అలిమేలుమంగ వేంకటరమణ’ సినిమా చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే.

జూన్​ నుంచి ఈ సినిమాను సెట్స్​పైకి తీసుకెళ్లడానికి ప్రయత్నాలు చేస్తోంది చిత్రబృందం. ఈ చిత్రంలో హీరోయిన్‌గా కీర్తి సురేష్ న‌టించ‌నుంద‌ని గ‌త కొద్ది రోజులుగా వార్త‌లు వ‌స్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో ఒక గెస్ట్ రోల్ ఉందట.

కేవలం ఒక సీన్ ఉండే ఈ పాత్ర క్లైమాక్స్ లో వస్తుందట. అయితే సినిమాకి ఆ పాత్ర ఎంతో కీలకమట. అందుకే ఆ రోల్‌లో న‌టించాల‌ని డైరెక్ట‌ర్ తేజ రానా దుగ్గ‌బాటిని సంప్ర‌దించార‌ట‌. అయితే గోపీచంద్ కోసం వెంట‌నే ఆ రోల్ చేసేందుకు రానా ఓకే చెప్పాడ‌ట‌. మ‌రి నిజంగా ఒకే స్క్రీన్‌పై గోపీచంద్‌, రానా క‌నిపిస్తే.. అభిమానుల‌కు పండ‌గే అవుతుంది.

Share post:

Latest