షూటింగ్‌కు నై నై అంటున్న పూజా..ఆలోచ‌న‌లో ప‌డ్డ ప్ర‌భాస్ డైరెక్ట‌ర్‌?

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌, పూజా హెగ్డే జంట‌గా న‌టిస్తున్న తాజా చిత్రం `రాధేశ్యామ్‌`. రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమా 1960 దశకం నాటి వింటేజ్‌ ప్రేమకథా చిత్రంగా రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రంలో కృష్ణంరాజు కూడా కీల‌క పాత్ర పోషిస్తున్నాడు.

గోపీకృష్ణ బ్యానర్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుద‌ల కానుంది. చివరి దశలో ఉన్న ఈ చిత్రం షూటింగ్ కేవ‌లం ప‌ది రోజులు మాత్రమే మిగిలి వుంది. ఈ షెడ్యూల్‌లో కృష్ణంరాజు, ప్ర‌భాస్‌ మరియు హీరోయిన్ పూజాహెగ్డే లకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను చిత్రీకరించాల్సి ఉందట.

ప్ర‌స్తుతం క‌రోనా వేగంగా వ్యాప్తి చెందుతోంది. వయసు రీత్యా కృష్ణంరాజును ఒత్తిడి చేసే అవకాశం లేదు. మ‌రోవైపు క‌రోనా దెబ్బ‌కు పూజా కూడా షూటింగ్‌కు నై నై అంటోంద‌ట‌. ఇలాంటి స‌మ‌యంలో షూటింగ్ చేయడం కష్టంమే. ఇక టెక్నిషియన్స్, ఆర్టిస్టుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ షెడ్యూల్ క్యాన్సిల్ చేయాల‌ని ప్ర‌భాస్ కోరాడ‌ట‌. అయితే షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉండ‌టం, విడుదల తేదీ ద‌గ్గ‌ర ప‌డ‌టంతో ఏం చేయాలో తెలియ‌క‌ రాధాకృష్ణ ఆలోచ‌న‌లో పడ్డార‌ట‌.‌

Share post:

Latest