మ‌హేష్ విరాభిమానితో ప్రేమ‌లో ప‌డ్డ రాశిఖన్నా!?

మ‌హేష్ విరాభిమానితో రాశిఖ‌న్నా ప్రేమ‌లో ప‌డింద‌ట‌. అయితే ఇది రియ‌ల్ లైఫ్‌లో కాదండోయ్‌.. రీల్ లైఫ్‌లోనే. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ఇటీవ‌లె శేఖ‌ర్ కమ్ముల ద‌ర్శ‌క‌త్వంలో `ల‌వ్‌స్టోరీ` చిత్రాన్ని పూర్తి చేసిన అక్కినేని నాగ‌చైత‌న్య ప్ర‌స్తుతం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో `థ్యాంక్యూ` సినిమా చేస్తున్నాడు.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ శర‌వేగంగా జ‌రుగుతోంది. ఈ చిత్రంలో సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుకు విరాభిమానిగా చైతూ క‌నిపించ‌నున్న సంగ‌తి తెలిసిందే.

ఇక ఈ సినిమా హీరోయిన్ ఎవరు అనే దానిపై ఇంతవరకు ఎలాంటి క్లారిటీ లేదు. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ చిత్రంలో రాశిఖ‌న్నాను హీరోయిన్‌గా ఎంపిక చేశార‌ట‌. ఇప్ప‌టికే సంప్ర‌దింపులు కూడా పూర్తి అయ్యాయ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇదే నిజ‌మైతే..చైతుతో ప్రేమ‌లో ప‌డే అమ్మాయిగా రాశి క‌నిపించ‌నుంది.

Share post:

Latest