యాంక‌ర్ ప్ర‌దీప్‌కు క‌రోనా..అందుకే ర‌వి అలా చేశాడ‌ట‌?

చైనాలో పుట్టుకొచ్చిన అతిసూక్ష్మ‌జీవి అయిన క‌రోనా వైర‌స్‌.. అన్ని దేశాల్లోని అన్ని రాష్ట్రాల‌కు పాకేసి ముప్ప‌తిప్పులు పెడుతున్న సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా సెకెండ్ వేవ్‌లో క‌రోనా మ‌రింత వేగంగా విస్త‌రిస్తుండ‌డంతో.. సామాన్యులు, సెల‌బ్రెటీలు, రాజ‌కీయ నాయ‌కులు ఇలా అంద‌రూ ఈ మ‌హ‌మ్మారి బారిన ప‌డుతున్నారు.

తాజాగా బుల్లితెర స్టార్ యాంక‌ర్‌, హీరో ప్ర‌దీప్ మాచిరాజు కూడా క‌రోనా బారిన ప‌డిన‌ట్టు తెలుస్తోంది. ప్రదీప్ ప్రస్తుతం క్వారంటైన్ లో ఉన్నాడ‌ని.. వైద్యుల సూచన మేరకు చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ విషయం గురించి ఇప్పటి వరకు ప్రదీప్ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.

అయితే ఈటీవీ ఢీ, జీ తెలుగులో డ్రామా జూనియర్స్ షో లలో యాంకర్ గా చేస్తున్నాడు ప్ర‌దీప్‌. ఇప్పుడు ఆ షోస్‌లో ప్ర‌దీప్ కాకుండా ర‌వి హోస్ట్‌గా క‌నిపించాడు. ప్ర‌దీప్‌కు క‌రోనా సోక‌డం వ‌ల్లే.. ఆయ‌న ప్లేస్‌లో తాత్కాలికంగా ర‌వి యాంక‌ర్‌గా చేస్తున్నాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

Share post:

Latest