పవన్ కోసం మహేష్ ఫ్యాన్స్ ప్రత్యేక పూజలు ..ఎక్కడంటే..!?

సాధారణంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల అభిమానుల మాటలను, ఫాన్స్ తూచా తప్పకుండా పాటిస్తారు. ఒక్కొక్కసారి అభిమానుల మధ్య మాటల యుద్ధాలు, ఆయా హీరోలకు కొత్త చిక్కులు తెస్తుంటాయి. అయితే ఇక్కడ ఎవరూ ఊహించని విధంగా మహేష్ బాబు ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ కోలుకోవాలని పూజలు చేయడం విశేషం. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే. పుట్టపర్తి లో మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్, పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలంటూ హనుమాన్ టెంపుల్ లో పూజలు చేయించడం, ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

ఇందుకు కారణం మహేష్ బాబు, పవన్ త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. ఇది చూసిన మహేష్ బాబు ఫ్యాన్స్ వెంటనే మహేష్ బాబు పై ఉన్న గౌరవం తో ఏకంగా పవన్ కోలుకోవాలంటూ పూజలు చేయడంతో అందరు ఆశ్చర్యపోతున్నారు. ఈ సంఘటన చూస్తే అక్కడ స్టార్ హీరోలు మాత్రమే స్నేహితులుగా ఉండటమే కాకుండా ఇక్కడ అందరి హీరోల అభిమానులు కూడా గొడవ పడకుండా ఇలా సన్నిహితంగా ఉండటం విశేషం.

Share post:

Popular