మహేష్ అడ్డాలో పవన్ రికార్డ్…!?

టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేశ్ బాబు ప్రముఖ హీరోనే కాదు ప్రొడ్యూసర్ అండ్ ఎగ్జిబిటర్ కూడా. మూడేళ్ళ క్రితం ఏషియన్ ఫిలిమ్స్ సునీల్ నారంగ్ తో కలిసి మహేశ్ బాబు కొండాపూర్ లో ఎ.ఎం.బీ. మల్టీప్లెక్ట్స్ థియేటర్లను నిర్మించాడు. తెలంగాణలో మోస్ట్ పాపులర్ మల్టిప్లెక్స్ గా ఏఎంబీ నిలిచింది. ఇందులో మొత్తం ఏడు స్క్రీన్స్ ఉన్నాయి.

అసలు విశేషం ఏంటంటే, ఈ నెల 9న విడుదల కానున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ మూవీ ఈ మల్టీప్లెక్స్ లోని ఏడు స్క్రీన్స్ లోనూ ప్రదర్శితం కాబోతోంది. ఇంకో విశేషం ఏంటంటే ఆన్ లైన్ అడ్వాన్స్ బుకింగ్ ను ఓపెన్ చేయగానే కొన్ని నిమిషాల వ్యవథిలో ఓపెనింగ్ రోజున ఈ ఏడు స్క్రీన్స్ హౌస్ ఫుల్ అయిపోయాయి. ఫస్ట్ డే మొత్తం 27 షోస్ ను ప్రదర్శిస్తుంటే, అన్నీ హౌస్ ఫుల్ కావడం ఈ మల్టీప్లెక్స్ మూడేళ్ళ చరిత్రలో ఇదే ఫస్ట్ టైమ్ . దీనితో పవర్ స్టార్ స్టామినా ఏమిటో అందరికి మరోసారి రుజువైంది.

Share post:

Latest