మ‌ళ్లీ సాయిప‌ల్ల‌వినే కావాలంటున్న యంగ్ హీరో..ఒప్పుకుంటుందా?

సాయిప‌ల్ల‌వి.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు.`ఫిదా` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన సాయిప‌ల్ల‌వి..మొదటి సినిమాతోనే హిట్ కొట్టడమే కాకుండా అందరి దృష్టినీ తన వైపుకు సునాయాసంగా మళ్లించుకోగలిగింది.

- Advertisement -

ఇక‌ కెరీర్ బిగినింగ్‌ నుంచి వైవిధ్యమైన పాత్రలు చేస్తూ త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న‌ ఈ బ్యూటీ.. ప్ర‌స్తుతం తెలుగులో సాయిపల్లవి రానాతో విరాటపర్వం, నాగచైతన్యతో లవ్‌స్టోరి, నానితో శ్యామ్‌ సింగరాయ్‌ సినిమాల్లో నటిస్తుంది. అయితే తాజాగా ఈ అమ్మ‌డుకు మ‌రో ఆఫ‌ర్ వ‌చ్చిందంట‌. టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ప్ర‌స్తుతం ‘మ్యాస్ట్రో’ చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

అయితే ఈ చిత్రం త‌ర్వాత ‌నితిన్ వక్కంతం వంశీతో ఓ సినిమా చేయ‌నున్నాడ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే ఈ చిత్రంలో సాయి ప‌ల్ల‌వినే తీసుకోవాల‌ని నితిన్ భావిస్తున్నాడ‌ట‌. ఈ విష‌యంలో వ‌క్కంతం వంశీ కూడా పాజిటివ్‌గానే ఉన్నాడ‌ట‌. దీంతో ఆమెతో సంప్ర‌దింపులు షురూ చేశార‌ట‌. కాగా, గ‌తంలో `శ్రీనివాస కళ్యాణం’ సినిమాలో సాయిపల్లవిని తీసుకోవాల‌ని నితిన్ అనుకున్నాడు. కానీ, హీరోయిన్‌ పాత్రకు సరైన ప్రాధాన్యత లేదన్న కారణంగా సాయి పల్లవి నో చెప్పింద‌ట‌. మ‌రి ఇప్పుడైనా సాయి ప‌ల్ల‌వి నితిన్ సినిమాకు ఓకే చెబుతుందో..లేదో..చూడాలి. ‌

Share post:

Popular