క‌రోనా ఎఫెక్ట్‌..నానికి హ్యాండిచ్చిన ప్ర‌ముఖ హీరోయిన్‌!

న్యాచుర‌ల్ స్టార్ నాని ప్ర‌స్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో `అంటే సుందరానికీ!` ఒక‌టి. వివేక్‌ ఆత్రేయ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ప్ర‌స్తుతం క‌రోనా విజృంభిస్తున్న‌ప్ప‌టికీ.. ఈ సినిమా షూటింగ్‌ను ఆప‌డం లేదు. త‌క్కువ మంది సిబ్బందితో అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ షూటింగ్‌ను ఫినిష్ చేసే ప‌నిలో ఉన్నారు నాని.

ఇక ఈ చిత్రంలో మళయాలీ భామ నజ్రియా నజీమ్ నటిస్తోంది. తెలుగులో ఆమె చేస్తున్న మొదటి సినిమా ఇదే. ఇటీవ‌లె షూటింగులో పాల్గొనడానికి ఈమె హైదరాబాద్ వచ్చింది. అంటే సుందరానికీ! టీమ్ న‌జ్రియాకు గ్రాండ్ వెల్క‌మ్ కూడా చెప్పింది.

అయితే హైదరాబాద్ వచ్చిన తరువాత ఇక్కడి కరోనా కేసుల తీవ్రత చూసిన నజ్రియా.. ఇలాంటి పరిస్థితుల్లో తాను షూటింగ్ చేయలేనని చెప్పేసి వెళ్లిపోయింది. ఇక న‌జ్రియా హ్యాండ్ ఇవ్వ‌డంతో ఆమె కాంబినేషన్లోని సీన్స్ ను వాయిదా వేసుకున్నట్టుగా టాక్ న‌డుస్తోంది.

Share post:

Latest