థియేట‌ర్ల‌లో బోల్తా ప‌డినా అక్క‌డ దూసుకుపోతున్న `వైల్డ్ డాగ్‌`!

కింగ్ నాగార్జున హీరోగా అహిషోర్ సాల్మన్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన తాజా చిత్రం `వైల్డ్ డాగ్‌`. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై నిరంజన్‌రెడ్డి, అన్వేష్‌రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో దియా మీర్జా, సయామీఖేర్‌, అతుల్‌ కులకర్ణి, అలీ రెజా త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషించారు.

ఏప్రిల్ 2న విడుద‌లైన ఈ చిత్రం మంచి టాక్ తెచ్చుకున్న‌ప్ప‌టికీ..బాక్సాఫీస్ దగ్గర మాత్రం యావరేజ్ గా నిలిచింది. దీంతో ఈ చిత్రాన్ని వెంట‌నే ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ నెట్ ప్లిక్స్ లో విడుద‌ల చేశారు. కంటెంట్‌ పరంగా బాగున్నా కలెక్షన్ల పరంగా నిరాశపరచిన వైల్డ్‌ డాగ్ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో దుమ్మ దులుపుతోంది.

దక్షిణాది నాలుగు భాషలలోనూ భారీ వ్యూస్ రాబ‌ట్టిన‌ ఈ సినిమా దక్షిణాది రికార్డ్ ను బద్దలు కొట్టినట్లు నెట్ ఫ్లిక్స్ వెల్ల‌డించింది. పాన్ ఇండియా రేంజ్‌ నిర్మాణ విలువలు, కథను నడిపిన తీరు, నాగార్జున నటన ఈ చిత్రానికి హైలెట్‌గా నిలువడంతో ఇతర భాషలలో కూడా ఓటీటీ ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. మొత్తానికి థియేట‌ర్ల‌లో బోల్తా ప‌డిన ఈ చిత్రం ఓటీటీలో మాత్రం దూసుకుపోతోంది.

Share post:

Popular