దారుణం: తల్లీ, ఇద్దరు పిల్లల హత్య…ఎందుకంటే..!?

ఆంధ్రప్రదేశ్‌ లోని విజయవాడ నగరంలో పెద్ద ఘోర సంఘటన చోటు చేసుకుంది. విజయవాడ నగరంలోని వాంబే కాలనీలో అనుమానాస్పద స్థితిలో తల్లి, ఇద్దరు బిడ్డలు చనిపోవటం తో అక్కడ తీవ్ర కలకలం రేపుతుంది. వాంబే కాలనీ డీ బ్లాక్‌లో నివసిస్తున్న తల్లి, ఇద్దరు పిల్లలు రక్తపు మడుగులో పడి చనిపోయారు. ఇది గమనించిన అక్కడ స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా, ఘటన స్థలానికి వెంటనే పోలీసులు సంఘటన జరిగిన దగ్గరకి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

కాగా, అక్కడ స్థానికులు చనిపోయిన ఆమె భర్త పై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాలి. ఈ సంఘటన వాంబే కాలనీతో పాటు విజయవాడ నగరంలో తీవ్ర కలకలం రేపుతోంది. స్థానికులు ఇచ్చిన సమాచారం ప్రకారం పోలీసులు ఈ కేసు నమోదు చేసి అక్కడ జరిగిన సంఘటనకు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు.

Share post:

Popular