నేడు ఐపీఎల్‌లో ధోనీ వ‌ర్సెస్‌ కోహ్లీ..ఈ మెగా క్లాష్‌లో గెలుపెవ‌రిదో?

ఇండిన్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2021లో భాగంగా ముంబయిలోని వాంఖడే స్టేడియం వేదికగా నేటి మధ్యాహ్నం 3.30 గంటలకి ర‌స‌వ‌త్త‌ర‌మైన మ్యాచ్ జ‌ర‌గ‌బోతోంది. మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలో చెన్నై సూపర్ కింగ్స్, విరాట్ కోహ్లీ నేతృత్వంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు ఈ మ్యాచ్‌లో త‌ల‌ప‌డ‌నున్నాయి.

తాజా సీజన్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ విజ‌యం సాధించిన‌ బెంగళూరు జోరు మీద ఉంది. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ ఆడిన ఫస్ట్ మ్యాచ్‌లో ఓడినా.. ఆ తర్వాత హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతోంది.

పాయింట్ల పట్టికలో ఒకటి, రెండు స్థానాల్లో ఉన్న ఈ జట్ల మధ్య నేడు జ‌ర‌గ‌బోయే మెగా ఫైట్‌లో గెలిచేది ఎవ‌ర‌న్న‌ది అంద‌రిలోనూ ఆస‌క్తిక‌రంగా మారింది. కాగా, ఈ రోజు రాత్రి ఢిల్లీ కాపిటల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య మరో మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.

Share post:

Latest