కేటీఆర్‌కు మంచు లక్ష్మీ స‌ల‌హా..మండిప‌డుతున్న నెటిజ‌న్లు!

సెకెండ్ వేవ్‌లో వేగంగా విజృంభిస్తున్న క‌రోనా వైర‌స్ ఎవ‌ర్నీ వ‌దిలి పెట్ట‌డం లేదు. చిన్నా, పెద్దా, ఉన్నోడు, లేనోడు అనే తేడా లేకుండా అంద‌రిపై పంజా విసురుతోంది. ఇప్ప‌టికే ఎంద‌రో ప్ర‌ముఖులు క‌రోనా బారిన ప‌డ‌తా.. తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు కూడా క‌రోనా సోకింది.

ఈ విష‌యాన్ని స్వ‌యంగా ఆయ‌నే తెలిపారు. దీంతో టీఆర్ఎస్ పార్టీ నేత‌లు, అభిమానులు, సినీ ప్ర‌ముఖులు కేటీఆర్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని కోరుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే నటి మంచు లక్ష్మీ కూడా కేటీఆర్‌కు ఓ ట్వీట్ పెట్టింది. ఆ ట్వీట్ కార‌ణంగానే మంచు ల‌క్ష్మీని ఇప్పుడు నెటిజ‌న్లు తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు.

ఇంత‌కీ ఆమె ఏం ట్వీట్ చేసిందంటే..`మిత్రమా కేటీఆర్ నువ్వు త్వరగా కోలుకోవాలి. ఈలోపు నా సినిమాలు అన్ని చూసేయ్’ అని పేర్కొంది. దీంతో నెటిజ‌న్లు భిన్నంగా స్ప‌దిస్తున్నారు. కరోనాతో పోరాడుతున్న సమయంలో మీ సినిమాలు చూస్తే ఇంక అంతే సంగతులు, క‌రోనా టైమ్‌లో ప‌నిష్మెంట్స్ ఎందుకులే, అంత సాహ‌సం కేటీఆర్ చేయ‌రులే అంటూ సెటైర్లు పేలుస్తున్నారు.

Share post:

Latest