పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం `వకీల్ సాబ్`. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వరా క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, బోణీ కపూర్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం భారీ అంచనాల నడుము ఏప్రిల్ 9న థియేటర్లలో విడుదల కాగా.. హిట్ టాక్ సొంతం చేసుకుంది.
ఇక తాజాగా ఈ చిత్రాన్ని చూసిన సూపర్ స్టార్ మహేష్ బాబు పవన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వకీల్ సాబ్ అద్భుతంగా ఉందని ప్రశంసించిన మహేష్.. లాయర్ గా పవన్ పవర్ ప్యాక్ పర్ఫామెన్స్ చుపించారని అన్నారు.
ప్రకాశ్ రాజ్ తనలోని ప్రతిభను మరోసారి తెరపైకి తెచ్చారని, నివేద, అంజలి, అనన్యలు మనసులను హత్తుకునేలా సినిమాలో లీనమయ్యారని మహేష్ వ్యాఖ్యానించారు. అలాగే దర్శక, నిర్మాతలకు మరియు ఎంటైర్ టీమ్‌కు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. దీంతో ప్రస్తుతం మహేష్ ట్వీట్ వైరల్‌గా మారింది.