రెండు రికార్డులు సొంతం చేసుకున్న సాయిపల్లవి !

నాగచైతన్య, సాయిపల్లవి హీరో హీరోయిన్ గా నటిస్తున్న లవ్ స్టోరీ చిత్రం ఈ నెల 16న రిలీజ్ కాబోతోంది. సోషల్ మీడియాలో ఈ సినిమా కొత్త రికార్డు సాధించింది. ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీలోని సారంగ దరియా లిరికల్ వీడియో సరికొత్త రికార్డ్ ను క్రియేట్ చేసింది. తెలుగు సినిమాలో అత్యంత త్వరగా వంద మిలియన్ వ్యూస్ ను దక్కించుకున్న లిరికల్ వీడియోగా సారంగ దరియా రికార్డు సాధించింది. వంద మిలియన్ వ్యూస్ ను సౌత్ లో అందుకున్న రెండో సినిమా ఇది.

ఇది వరకు రౌడీ బేబీ సాంగ్ అత్యధిక వ్యూస్ దక్కించుకుంది. దానిలో కూడా చేసింది సాయిపల్లవే. తొందర్లో జరగనున్నఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కోమలి ఈ పాటను స్టేజ్ పై పడనుంది. ఈ చిత్రంలో సారంగ దరియా సాంగ్ ని మంగ్లీ పాడింది. ఈ పాటకు వంద మిలియన్ వ్యూస్ లభించడం పట్ల మంగ్లీ ఆనందం వ్యక్తం చేసింది.

Share post:

Latest