స్టేజ్‌పైనే మోనాల్‌కు ముద్దు పెట్టేసిన డ్యాన్స్ మాస్ట‌ర్..వీడియో వైర‌ల్‌!‌

మోనాల్ గ‌జ్జ‌ర్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. తెలుగులో ప‌లు చిత్రాలు చేసిన మోనాల్‌.. తెలుగు బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ సీజ‌న్ 4లో పాల్గొన్న సంగ‌తి తెలిసిందే. ఈ షో ద్వారా సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంది మోనాల్‌. ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత‌.. సినిమాలు, ఐటెం సాంగ్స్‌, టీవీ షోల‌తో ఫుల్ బిజీ బిజీగా గ‌డుపుతోంది మోనాల్‌.

- Advertisement -

ఈ క్ర‌మంలోనే ప్ర‌స్తుతం మోనాల్.. స్టార్‌ మాలో వస్తున్న డ్యాన్స్‌ ప్లస్‌ రియాలిటీ షోకు మెంటర్‌గా వ్య‌వ‌హ‌రిస్తోంది. అయితే తాజాగా డ్యాన్స్‌ ప్లస్‌ రియాలిటీ షో ప్రోమోను స్టార్‌ మా విడుదల చేసింది. ఈ ప్రోమోలో కన్నా మాస్టర్ మోనాల్‌ను స్టేజ్‌పైకి తీసుకువేళ్లి తనతో స్టేప్పులేశాడు.

అనంతరం ఆమెకు గులాబి పువ్వు ఇచ్చి మోకాళ్లపై కుర్చోని మోనాల్‌ చేయిపై అంద‌రి ముందు ముద్దు పెట్టేవాడు. దీంతో అక్క‌డ ఉన్న వారంతా ఒకింత షాక్‌కు గుర‌య్యారు. దీంతో ఈ ప్రోమో ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతోంది. ‌

Share post:

Popular