తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడ్డాయి. ఈ ఎన్నికల్లో సత్తా చాటాలని సినీ నటుడు మక్కల్ నీతి మయ్యం(ఎంఎన్ఎం) అధినేత కమల్ హాసన్ విసృతంగా ప్రచారాలు నిర్వహించారు. మార్పు కోరుకునే వారు ఎన్నికల్లో తనతో కలిసిరావాలని, ఎంఎన్ఎం అభ్యర్థులకు ఓటువేయాలని కమల్ ప్రచారాలు చేశారు.
అయితే ఈ క్రమంలోనే సినిమాల విషయంలో సంచలన ప్రకటన కూడా చేశారు.అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల 6న జరుగనున్న నేపథ్యంలో ఆదివారం పార్టీ కార్యకర్తలతో కమల్ మాట్లాడారు. ఈ సందర్భంగా కమల్.. ప్రజా సేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చా. తన రాజకీయ జీవితానికి సినిమాలు అడ్డంకిగా ఉన్నాయని భావిస్తే.. సినిమాలను వదలిపెట్టేందుకు సిద్ధమని ప్రకటించారు.
అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక తాను రాజకీయాల నుంచి తప్పుకొని, మళ్లీ సినిమాలు చేసుకుంటానని చాలామంది అంటున్నారు.రాజకీయాల్లో కనిపించనా లేక సినిమాల్లో కనిపించనా అన్నది తర్వలో తెలుస్తుంది. ప్రజలే దీన్ని నిర్ణయిస్తారనిని కమల్ వ్యాఖ్యానించారు. దీంతో కమల్ వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.