త్రివిక్రమ్‌, ఎన్టీఆర్‌ మూవీకి బ్రేక్..!?

టాలీవుడ్ యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ప్రస్తుతం ఎస్‌ఎస్‌ రాజమౌళి దర్శకత్వంలో ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం తరువాత ఎన్టీఆర్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో ఓ సినిమా చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు తాజాగా ఓ షాకింగ్‌ న్యూస్‌ బయటకు వచ్చింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ వాయిదా పడిందని సమాచారం.

స్క్రిప్ట్‌ విషయంలో ఎన్టీఆర్‌ అసంతృప్తిగా ఉన్నాడని, దానితో త్రివిక్రమ్ ఎన్టీఆర్‌ అసంతృప్తితో ఉన్న ప్రాజెక్ట్‌ను సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబుతో తీయాలనే ఆలోచనట్లు ఉన్నట్లు వినికిడి. అయితే ఇది ఎంతవరకు నిజమన్నది ఇంకా తెలియాలి. ఒకవేళ అదే నిజమైతే ఎన్టీఆర్‌ వదులుకున్న ఈ ప్రాజెక్ట్ ని మహేష్ బాబు ఒకే చేస్తాడో లేదో వేచి చూడాలి. కాగా ఎన్టీఆర్‌ ఉప్పెన మూవీ డైరెక్టర్‌ బుచ్చిబాబు సనా డైరెక్షన్‌లో ఓ సినిమా తీస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. చూడాలి మరి ఎన్టీఆర్ చివరికి ఏ ప్రాజెక్ట్ ఒప్పుకోనున్నాడో.

Share post:

Latest