థ్రిల్లింగ్‌గా `ఇష్క్‌‌` ట్రైల‌ర్‌..తేజ సజ్జాకు మ‌ళ్లీ హిట్ ఖాయ‌మా?

తేజ‌ స‌జ్జా.. చైల్డ్ ఆర్టిస్ట్‌గా మంచి పెరు తెచ్చుకున్న ఈయ‌న `జాంబి రెడ్డి` సినిమాతో హీరో మారాడు. ఈ చిత్రం మంచి విజ‌యం సాధించ‌డంతో.. తేజ‌కు సూప‌ర్ క్రేజ్ ఏర్ప‌డుతుంది. ప్ర‌స్తుతం ఈయ‌న న‌టిస్తున్న తాజా చిత్రం `ఇష్క్‌`. నాట్ ఎ ల‌వ్ స్టోరీ అనేది ట్యాగ్‌లైన్‌.

య‌స్‌.య‌స్‌.రాజు ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో తేజ‌కు జోడీగా ప్రియా ప్రకాష్ వారియ‌ర్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఆర్‌.బి. చౌద‌రి స‌మ‌ర్ప‌ణ‌లో సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యాన‌ర్‌పై ఎన్వీ ప్రసాద్‌, పార‌స్ జైన్‌, వాకాడ అంజ‌న్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 23న ఈ చిత్రం విడుద‌ల కానుండ‌గా.. తాజాగా చిత్ర యూనిట్ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు.

హీరోహీరోయిన్ల మధ్య ముద్దు ముచ్చట్లతో మొదలైన ఈ ట్రైలర్.. ఒక్కసారిగా మారిపోయింది. సడన్ గా హీరోని ఎవరో తరుముతున్నట్లుగా చూపించారు. తేజాను వెంబడిస్తున్న ఆ వ్యక్తి ఎవరు? దీనికి అసలు కారణమేమిటి? అతన్ని ఎలా కనుగొంటాడు? ఈ క్రమంలో హీరోకి ఎదురయ్యే సమస్యలేమిటి? అనేది ఈ కథలో చూపించబోతున్నట్లు అర్థం అవుతోంది. మొత్తానికి సూప‌ర్ థ్రిల్లింగ్‌గా ఉన్న ఈ ట్రైల‌ర్ సినిమాపై అంచ‌నాల‌ను పెంచేసింది. మ‌రి ఆ అంచ‌నాల‌ను రీచ్ అయ్యి మ‌ళ్లీ తేజ హిట్ కొడ‌తాడో లేదో చూడాలి.

Share post:

Popular