టాలీవుడ్ కి గుడ్ బాయ్ అంటున్న రష్మిక..!?

రష్మిక మందాన కన్నడ నుంచి వచ్చి టాలీవుడ్ లో వన్ అఫ్ ది టాప్ హీరోయిన్ గా ఎదిగింది. ఈ బ్యూటీ కి బాలీవుడ్లో కూడా మంచి అవకాశాలు వస్తున్న క్రమంలో ఇంక అక్కడే సెటిల్ అయిపోయే విధంగా కనిపిస్తుందట రష్మిక. ప్రస్తుతం ఆమె సిద్ధార్థ్ మల్హోత్రా సరసన ఒక చిత్రంలో నటిస్తుంది. ఆమె తాజగా టాలీవుడ్ కి గుడ్ బాయ్ చెప్తున్నట్లు పలు వార్తలు షికార్లు కొడ్తున్నాయి. ప్రస్తుతం సిద్ధార్థ్ మల్హోత్రా మిషన్ మజ్ను, ఇంకా బిగ్ బి అమితాబ్ తో గుడ్ బాయ్ చిత్రాల్లో చేస్తుంది.

 

ఇవే కాకుండా బాలీవుడ్ లో మరికొన్ని చిత్రాలు కూడా సైన్ చేసిందట. దాంతో రష్మిక డేట్స్ తెలుగు సినిమాకు ఇవ్వలేనంత బిజీ అయిపోయిందట రష్మిక. దాంతో ఇక టాలీవుడ్ నుంచి నిష్క్రమిస్తోంది అన్న ప్రచారంజోరుగా సాగుతుంది. కానీ ఆమె టాలీవుడ్ ని వదిలేసే ప్రసక్తే లేనట్లు ఆమె సన్నిహితులు చెప్తున్నారు. రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో వస్తున్న మూవీలో రష్మిక ను హీరోయిన్ గా తీసుకోనున్నారని టాక్. ఎన్టీఆర్ కొరటాల శివ చిత్రంలో కూడా రష్మికనే అనుకుంటున్నారట.

Share post:

Latest