నిశ్చితార్థం అనంతరం బ్రేకప్ చెప్పిన బాలీవుడ్ బ్యూటీ..!?

పాకిస్థాన్ హీరోయిన్ సబా కమర్ సోషల్ మీడియా పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు పెద్ద సంచలనంగా మారింది. హీరోయిన్ సబా కమర్ నిశ్చితార్ధం జరుపుకున్న వ్యక్తితో, నిశ్చితార్థం అనంతరం బ్రేకప్ అయినట్లు చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది సబా కమర్. ఇర్ఫాన్‌ పఠాన్‌ ప్రధాన పాత్రలో నటించిన హిందీ మీడియం మూవీతో బాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన పాకిస్థానీ బ్యూటీ సబా కమర్‌.

వ్యాపారవేత్త అజీమ్‌ ఖాన్‌తో ఇటీవల ఆమెకు నిశ్చితార్థం అయ్యింది. ఇంకొద్ది రోజులలో ఇద్దరు వివాహం చేసుకుంటారు అనుకుంటున్నా సమయంలో, సబా వ్యక్తిగత కారణాలతో విడిపోతున్నట్లు తాజాగా తెలియజేసింది. సబా కమర్ పెట్టిన సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఇప్పుడు పెద్ద సంచలనం అవుతుంది. నిశ్చితార్ధం అయిన ఆ వ్యక్తితో తనకు బ్రేకప్ అయినట్లు చెప్పి నెటిజన్స్ అందరిని షాక్ కి గురి చేసింది ఈ పాకిస్తానీ భామ.