కరోనా రోగికి హీరో సహాయం…?

దేశ వ్యాప్తంగా ప్రతిరోజు లక్షల్లో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. ఈ మధ్య కాలంలో కరోనా పేషెంట్లకు ఎంతో అవసరమైన ఆక్సిజన్ కొరత కూడా ఉండనే ఉంది.
మరో వైపు కరోనా పేషెంట్ లకు అత్యవసరం సమయంలో ముఖ్యమైన రెమిడిసివిర్‌ లు కూడా దొరకడం లేదు. ఈ మెడిసిన్ కోసం హాస్పిటల్ ముందు జనం గంటల కొద్దీ నిలబడినా ప్రయోజనం ఉండటం లేదు. ఇలాంటి పరిస్థితులలో ఓ వ్యక్తి తన తండ్రి కోసం సోషల్ మీడియా వేదిక ద్వారా తమ అభిమాన హీరో నిఖిల్ ని రెమిడిసివిర్‌ ఇప్పించాలంటూ కోరాడు.

సురేంద్ర అనే వ్యక్తి, కరోనా సోకిన తన తండ్రి పరిస్థితి వివరించి ఆయన కోసం రెమిడిసివిర్‌ ఇప్పించండి అంటూ ట్విట్టర్ వేదిక ద్వారా తన అభిమాన హీరో నిఖిల్ కు విజ్ఞప్తి చేశాడు. దీనికి స్పందించిన యువ హీరో నిఖిల్, సిరివూరి రాజేశ్‌ వర్మ అనే వ్యక్తి, రెమిడిసివిర్‌ డోసులతో మిమ్మల్ని సంప్రదిస్తాడు అంటూ సమాధానం ఇచ్చారు నిఖిల్. మీ నాన్న గారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను అంటూ పేర్కొన్నాడు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వార్త విన్న అందరు నిఖిల్ ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

Share post:

Latest