మ‌రోసారి డబుల్ రోల్ చేయ‌బోతున్న గోపీచంద్‌?‌

యాక్షన్ హీరో గోపీచంద్ త్వ‌ర‌లోనే ప్ర‌ముఖ ద‌ర్శకుడు తేజ‌తో `అలిమేలు మంగ వెంకటరమణ` అనే టైటిల్‌తో ఓ సినిమా చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. జయం, నిజం సినిమాల తర్వాత గోపీచంద్, తేజ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ఇది. అయితే ఆ చిత్రాల్లో విలన్‌గా నటించిన గోపీచంద్‌ ఈ సినిమాలో హీరోగా నటించనున్నారు.

ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తుంద‌ని బ‌లంగా టాక్ వినిపిస్తోంది. త్వ‌ర‌లోనే సెట్స్ మీద‌కు వెళ్ల‌నున్న ఈ చిత్రం గురించి ఓ ఇంట్ర‌స్టింగ్ అప్డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ చిత్రంలో గోపీచంద్ డ‌బుల్ రోల్‌లో న‌టించ‌నున్నాడ‌ట‌.

ట్విన్స్ గా పుట్టిన ఇద్దరు అనుకోకుండా విడిపోయి.. మళ్ళీ ముప్పై ఏళ్ల తరువాత కలిస్తే ఎలా ఉంటుంది ? పైగా ఇద్దరూ శత్రువులుగా కలిస్తే ఎలా ఉంటుంది ? అనే కోణంలో సినిమా ఉంటుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఇందులో ఎంత వ‌ర‌కు నిజ‌ముందో తెలియాల్సి ఉంది. కాగా, గోపీచంద్ తాజాగా న‌టించిన సీటీమార్ చిత్రం విడుద‌ల‌కు సిద్ధం అవుతున్న సంగ‌తి తెలిసిందే.

Share post:

Latest