గంగూభాయ్ కతియావాడి టీజర్ మీ కోసం..!

బాలీవుడ్ నటి అలియాభ‌ట్ ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ప‌రిచ‌యం అవుతున్న సంగతి మనకు తెల‌సిందే. హీరో రామ్ చ‌ర‌ణ్ సర‌స‌న సీత పాత్ర‌లో అలియా క‌నిపించ‌నుండ‌గా, ఇటీవ‌లే ఆమె ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేశారు. అలియా లుక్ ప్రేక్షకుల్ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. ఇకపోతే సంచలన బాలీవుడ్ దర్శకుడు సంజ‌య్ లీలా భ‌న్సాలీ అలియా భ‌ట్ ప్ర‌ధాన పాత్ర‌లో మా గంగూభాయ్ కతియావాడి అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ టీజర్ కి మంచి స్పందన వచ్చింది.

ముంబైలోని కామాతిపురాలో సెక్స్ వ‌ర్క‌ర్‌ అయిన గంగూభాయ్ క‌తియావాడి జీవిత ‌క‌థ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు సంజయ్ లీలా భన్సాలీ. ఈ మూవీలో అలియా భట్ వేశ్య పాత్ర‌లో కనిపిస్తుంది. తాజాగా ఈ చిత్రం తెలుగు వ‌ర్షెన్‌కు సంబంధించిన టీజ‌ర్ రిలీజ్ చేశారు. ఈ టీజ‌ర్ టాలీవుడ్ ప్రేక్ష‌కుల‌ని విపరీతంగా ఆక‌ట్టుకుంటుంది. ఈ సినిమా జూలై 30న విడుదల కానుంది.

Share post:

Latest