ఫ్యామిలీ మ్యాన్ 2 సందడి చేయటానికి అంతా సిద్ధం.!

టాలీవుడ్ నటి సమంత అక్కినేని ది ఫ్యామిలీ మ్యాన్ 2తో డిజ‌ట‌ల్ ప్లాట్ఫాంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ వెబ్ సిరీస్‌లో స‌మంత నటిస్తుండటంతో అందరిలో భారీ అంచ‌నాలు నెలకొన్నాయి. కానీ ఫిబ్ర‌వ‌రిలో రిలీజ్ కావ‌ల‌సిన ఈ వెబ్ సిరీస్ అనేక కార‌ణాల వ‌ల‌న వాయిదా పడుతూ వచ్చింది. 2019 సూపర్ హిట్ వెబ్ సిరీస్ లలో ఫ్యామిలీ మ్యాన్ ఒకటి.

దీనికి సీక్వెల్‌గా రూపొందుతున్న ఫ్యామిలీ మ్యాన్ 2 ని అమెజాన్ ప్రైమ్ వేదిక‌గా మే నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇందులో మనోజ్ బాజ్పేయి ఎన్ఐఏ ఏజెంట్ శ్రీకాంత్ తివారీగా నటించగా, ఆయనకు వ్యతిరేకంగా సమంత ఉగ్రవాది పాత్రలో రాజీగా క‌నిపించ‌నుంది. ఈ వెబ్ సిరీస్‌లో కొన్ని వివాద‌స్ప‌ద సీన్స్ ఉండటం వల్లన వాటిని రీ షూట్ చేశార‌ని, అందుకే ది ఫ్యామిలీ మ్యాన్ 2 కాస్త లేట్ అయింద‌ని అంటున్నారు దర్శక నిర్మాతలు. ఈ సిరీస్ కు రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించారు.

Share post:

Popular