ఎంపీ సంతోష్‌కుమార్‌కు కరోనా పాజిటివ్..!

తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు అయిన సంతోష్‌కుమార్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఎంపీ సంతోష్‌కుమార్‌కు కరోనా టెస్ట్లు చేయించుకోగా ఐంకి కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయింది. ఈ విషయాన్నిఆయనే స్వయంగా సోషల్ మీడియా అయిన ట్విట్టర్‌ ద్వారా పోస్ట్ చేసి తెలిపారు. ప్రస్తుతం తనకి కరోనా లక్షణాలు ఏమీ లేవని, ఆరోగ్యంగానే ఉన్నట్టు ఆయన తెలిపారు.

తనకు కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసి తన ఆరోగ్యం పట్ల ఎంతో మంది అభిమానులు, పార్టీ నాయకులు తనకు ఫోన్‌లు చేస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం తాను డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నానని, ఎవరూ ఆందోళన పడాల్సిన పని లేదని ఆయన చెప్పారు ఇటీవల తనను కలిసిన వారందరు కూడా వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన కోరారు. ప్రతి ఒక్కరూ మాస్క్‌లు ధరిస్తూ, వీలైనంత వరుకు ఇంట్లోనే ఉండాలని సంతోష్ కుమార్ కోరారు.

Share post:

Latest