`ఆచార్య‌` విడుద‌ల వాయిదా..టెన్ష‌న్‌లో అభిమానులు?

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో `ఆచార్య‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. నిరంజన్‌ రెడ్డి, రామ్‌చరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీలో రామ్ చరణ్ ‘సిద్ధ’ అనే కీలకపాత్ర పోషిస్తుండ‌గా.. కాజ‌ల్ అగ‌ర్వాల్‌, పూజా హెగ్డే హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.

మే 14వ‌ తేదీన ఈ చిత్రం ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంద‌ని చిత్ర యూనిట్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది. అయితే ఇప్పుడు ఈ సినిమా విడుద‌ల వాయిదా ప‌డేలా ఉంద‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. గ‌తంలో ఇలాంటి వార్త‌లు వ‌చ్చిన‌ప్ప‌టికీ.. చిత్ర యూనిట్ ఖండించింది. ఇక ఇప్పుడు మ‌ళ్లీ ఆచార్య విడుద‌ల వాయిదా ప‌డ‌నుందంటూ వార్త‌లు గుప్పుమంటున్నాయి.

ఎందుకంటే ఆచార్య ప్రకటన విడుదల తేదీకి కేవలం నెలరోజుల వ్యవథి మాత్రమే ఉంది. కానీ ఇంకా షూటింగ్‌ పూర్తి కాలేదు. ఎప్పటికీ పూర్తవుతుందో చెప్పలేకపోతున్నారు. మ‌రోవైపు వి.ఎఫ్‌.ఎక్స్‌ వర్క్ కూడా చాలా ఉంది. ఇలా హెవీ వర్క్‌ పెండింగ్‌లో ఉండటంతో ఆచార్య విడుదల తేదీని వాయిదా వేసే ఆలోచ‌న‌లో ద‌ర్శ‌క‌, నిర్మాతులు ఉన్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. దీంతో మెగా అభిమానులు టెన్ష‌న్ ప‌డుతున్నారు.

Share post:

Latest