బన్నీ ఫ్యాన్స్ మీద కేసు నమోదు.. ఎందుకుంటే..!?

April 9, 2021 at 12:53 pm

కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తూ , ఎటువంతి అనుమతి లేకుండా అర్ధరాత్రి టైంలో బాణసంచా కాల్చినందుకు టాలీవుడ్ సినీ హీరో అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ప్రశాంత్‌తో పాటు మరో అభిమాని సంతోష్‌ పై జూబ్లీహిల్స్‌ పోలీసులు ఐపీసీ సెక్షన్‌ 290, 336, 188 కింద కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం, అల్లు అర్జున్‌ బర్త్ డే సందర్భంగా బుధవారం నాడు అర్ధరాత్రి ఒంటిగంట టైములో జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం.68లోని ఆయన ఇంటికి వందలాది మంది ఫాన్స్ వెళ్లారు.

ఎటువంటి అనుమతులు తీసుకోకుండా ఒక గంటపాటు బాణసంచా కాల్చడంతో చుట్టుపక్కల అందరికి అసౌకర్యం కలిగింది. బాణాసంచా శబ్ధం వల్ల నిద్ర డిస్టర్బ్ అయ్యామని కొందరు డయల్‌ 100కు కాల్‌ చేసి ఫిర్యాదు చెయ్యగా , పోలీసులు అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ప్రశాంత్, మరో అభిమాని సంతోష్‌ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

బన్నీ ఫ్యాన్స్ మీద కేసు నమోదు.. ఎందుకుంటే..!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts