బ్యాక్ డోర్ సాంగ్ ని ఆవిష్కరించిన వై. ఎస్. షర్మిల..!

పూర్ణ ప్రధాన పాత్రలో తేజ త్రిపురాన హీరోగా కర్రి బాలాజీ దర్శకత్వం బి. శ్రీనివాస్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం బ్యాక్ డోర్. అన్ని పనులు పూర్తి చేసుకుని త్వరలోనే రిలీజ్కు సిద్ధం చేస్తున్నారు మేకర్స్. ఈ చిత్రానికి రవిశంకర్ నేపథ్య సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీలోని యుగాల భారత స్త్రీని అనే పల్లవితో సాగే సాంగ్ ని లోటస్ పాండ్ లో తెలంగాణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి వై. ఎస్. షర్మిల ఆవిష్కరించారు.

ఈ చిత్రం విజయం సాధించి, మూవీ బృందానికి మంచి పేరు రావాలని కోరుకుంటున్నట్లు ఆమె అన్నారు. చాలా బిజీ షెడ్యూల్ మధ్య తమకు టైం కేటాయించి సాంగ్ ని విడుదల చేయడంతో పాటు తమను అభినందించిన షర్మిలగారికి ఎప్పటికీ రుణపడి ఉంటామని నిర్మాత బి. శ్రీనివాస్ రెడ్డి, దర్శకుడు బాలాజీ అన్నారు.

Share post:

Latest