ప‌వ‌న్ అభిమానిపై అన‌సూయ షాకింగ్ కామెంట్స్‌..ఏం జ‌రిగిందంటే?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తాజా చిత్రం `వ‌కీల్ సాబ్‌`. వేణు శ్రీ‌రామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు, బోణీ క‌పూర్ సంయుక్తంగా నిర్మించారు. పవన్ ను ఎప్పుడెప్పుడు వెండి తెరపైన చూద్దామా అని అభిమానులంతా వేయి కళ్ళతో ఎదురుచూస్తుండ‌గా.. నిన్న ఈ చిత్రం ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయింది. దీంతో ప‌వ‌న్ అభిమానుల్లో సంద‌డి నెల‌కొంది.

ఈ క్ర‌మంలోనే ప‌వ‌న్ కటౌట్స్ కి కొంద‌రు ఫ్యాన్స్ పాలాభిషేకాలు చేయ‌డం, హార‌త‌లు ఇవ్వ‌డం చేసి నానా హంగామా చేశారు. అయితే ఒక అభిమాని మాత్రం ఏకంగా వకీల్ సాబ్ ప్రదర్శితమవుతున్న ఓ థియేటర్ లో తెరపై రక్తంతో పవన్ పేరు రాశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను తాజాగా చూసిన అన‌సూయ షాకింగ్ కామెంట్స్ చేసింది.

ఇది చూడ్డానికే భీతిగొలిపేలా ఉందన్న అన‌సూయ‌.. ఇదేం అభిమానం, తల్లిదండ్రులు ఎంత బాధపడతారో ఆలోచించరా? బాధ్యతగా వ్యవహరించాలి. అయినా అభిమానం ప్రదర్శించుకోవడానికి చాలా మార్గాలున్నాయి అని చెప్పుకొచ్చింది. దీంతో అన‌సూయ కామెంట్స్ వైర‌ల్‌గా మారాయి.

Share post:

Popular