అభిమానుల‌కు అదిరిపోయే న్యూస్ చెప్పిన అన‌సూయ‌!

అనసూయ భరద్వాజ్.‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బుల్లితెర‌పై స్టార్ యాంక‌ర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ‌.. అప్పుడ‌ప్పుడూ వెండితెర‌పై కూడా మెరుస్తుంటుంది. ఇక ప్ర‌స్తుతం ఈమె న‌టిస్తున్న చిత్రాల్లో `థాంక్యూ బ్ర‌ద‌ర్` ఒక‌టి.

ఈ సినిమాతో రమేశ్ దర్శకుడిగా పరిచయం అవుతుండ‌గా.. ఇందులో అశ్విన్ విరాజ్ కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. ఈసినిమాను జ‌స్ట్ ఆర్డిన‌రీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంలో మాగుంట శ‌ర‌త్ చంద్రారెడ్డితో కలిసి తారక్‌నాథ్ బొమ్మిరెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన పోస్ట‌ర్లు, టీజ‌ర్ సినిమాపై అంచ‌నాలు పెంచేశాయి.

దీంతో అన‌సూయ అభిమానులు ఈ చిత్రం ఎప్పుడెప్పుడు విడుద‌ల అవుతుందా అని ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి త‌రుణంలో అన‌సూయ గుడ్‌న్యూస్ చెప్పింది. తాజాగా ఈ సినిమా విడుద‌ల తేదీని అధికారికంగా ప్ర‌క‌టించింది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయ‌నున్నారు. కాగా, ఈ చిత్రంలో అర్చన, వైవా హర్ష, అనిల్ కురువిల్లా, అన్నపూర్ణ త‌దిత‌రులు న‌టించారు.

Image

Share post:

Latest