క‌రోనా బారిన ప‌డ్డ `ఆర్ఆర్ఆర్‌` హీరోయిన్‌..!

ప్ర‌పంచ‌దేశాల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్న ప్రాణాంత‌క క‌రోనా వైర‌స్ ఇప్ప‌టికే కొన్ని ల‌క్ష‌ల మందిని బ‌లి తీసుకున్న సంగ‌తి తెలిసిందే. ఆ మ‌ధ్య క‌రోనా నెమ్మ‌దించినా.. మ‌ళ్లీ వేగంగా విజృంభిస్తోంది. ఇక సామాన్యుల‌తో పాటు సెల‌బ్రెటీలు సైతం క‌రోనా బారిన ప‌డుతున్నారు.

- Advertisement -

తాజాగా ఆర్ఆర్ఆర్ హీరోయిన్‌, బాలీవుడ్ బ్యూటీ ఆలియా భ‌ట్‌కు క‌రోనా సోకింది. ఈ మేరకు అలియా భట్ ఇన్‌స్టా‌లో గురువారం అర్థరాత్రి వెల్లడించింది. తనకు క‌రోనా పాజిటివ్ నిర్థారణ అయిందని.. వెంటనే ఇంట్లోనే ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయినట్లు అలియా పేర్కొంది.

వైద్యుల సలహా మేరకు ఎప్పటికప్పుడు అన్ని రకాల రక్షణ చర్యలు తీసుకుంటున్నానని తెలిపింది. కాగా, ప్ర‌స్తుతం ఆలియా ఆర్ఆర్ఆర్‌తో పాటు సంజయ్ లీలా భన్సాలీ తీస్తున్న `గంగూబాయి కతియావాడి` సినిమాలో న‌టిస్తోంది.

Share post:

Popular