బన్నీ సోదరిగా ఐశ్వర్య రాజేష్!?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ డైరెక్టర్ సుకుమార్ కంబినేషన్లో రాబోతున్న సినిమా పుష్ప. ఈ సినిమా పై అందరికి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల రిలీజ్ అయిన మూవీ టీజర్ తో అటు ఫ్యాన్స్ ఇటు ఆడియన్స్ పుల్ ఫిదా అయిపోయారు. మలయాళ స్టార్ హీరో పహాద్ ఫాజిల్ విలన్ గా నటిస్తుండటం, ప్రత్యేక పాత్రలో ఊశ్వరిరౌటేలా చేస్తుండటం సినిమాకి మరింత క్రేజ్ తీసుకొస్తున్నాయి.

ఐటమ్ సాంగ్స్ స్పెషలిస్ట్ అయిన దేవిశ్రీ ప్రసాద్ ఇందులో ఓ అద్భుతమైన ఐటమ్ సాంగ్ కంపోజ్ చేశాడట. దానినే ఊర్వశి పై చిత్రీకరించనున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీలో మరో హీరోయిన్ ఐశ్వర్య రాజేష్, బన్నీ సోదరి పాత్రలో కనిపించనుందట. ఐశ్వర్య సెంటిమెంట్ ట్రాక్ ఈ చిత్రంలో మెయిన్ అంటున్నారు. ఆమె చావుకి బన్నీ పగ తీర్చుకోవడమనే అంశం మూవీకి పెద్ద హైలైట్. రష్మిక గిరిజన యువతిగా కనిపించనున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.

Share post:

Popular