`మహాసముద్రం` న్యూ అప్డేట్‌..అదిరిన అదితిరావు ఫ‌స్ట్ లుక్!

శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా ఆర్ఎస్ 100 ఫేమ్ అజయ్ భూపతి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `మ‌హాస‌ముద్రం`. ఈ చిత్రంలో అనూ ఇమ్మాన్యుయేల్, అదితిరావు హైదరి హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.

ఏకే ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 19న విడుద‌ల‌ కానుంది. అయితే తాజాగా అదితిరావు హైదరి ఫ‌స్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఈ చిత్రంలో ‘మహా’ అనే రోల్‌లో అదితిరావు హైదరి కనిపించనుందని పేర్కొంటూ ఫ‌స్ట్ లుక్ పోస్ట్ విడుద‌ల చేశారు.

Image

దుఃఖాన్ని దిగమింగుకుంటూ, కన్నీళ్లను వర్షిస్తూ, తడారిపోయిన పెదలతో చాలా డిఫ‌రెంట్‌గా అదితిరావు ఈ పోస్టర్‌లో క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం ఈ పోస్ట‌ర్ ఆమె అభిమానుల‌ను తెగ ఆక‌ట్టుకుంటోంది.

Share post:

Latest